Telangana : మరోసారి కంపించిన భూమి

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం నాడు భూకంపం వచ్చింది.

By Medi Samrat
Published on : 7 Dec 2024 2:15 PM IST

Telangana : మరోసారి కంపించిన భూమి

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం నాడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై వీటి తీవ్రత 3.0 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. భూమి కంపించడంతో ప్రజలు కంగారుపడ్డారు. పలు ప్రాంతాల్లో భూమి కంపించిందంటూ ప్రజలు తెలిపారు.

ఇటీవల కూడా భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న తెలంగాణలోని ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది.

Next Story