ఐదేళ్ల‌లో మహిళా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు : డిప్యూటీ సీఎం

అప్పులు చేసి సంపద సృష్టిస్తాం.. ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.

By Medi Samrat  Published on  19 Jun 2024 8:59 AM GMT
ఐదేళ్ల‌లో మహిళా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు : డిప్యూటీ సీఎం

అప్పులు చేసి సంపద సృష్టిస్తాం.. ఆ సంపద ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మహిళా సంఘాలకు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామ‌ని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసిన వారి సమాచారం అధిష్టానం వద్ద సమగ్రంగా ఉంది.. త్వరలోనే పనిచేసిన వారికి పదవులు అందుతాయన్నారు.

రైతు రుణమాఫీకి పూర్తిగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని భ‌రోసా ఇచ్చారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కుల గణన చేపట్టాలి తద్వారా దేశ సంపద వనరులు పంచబడాలి. పాలనలోను భాగస్వాములను చేయాలన్న‌ది మా డిమాండ్ అని పేర్కొన్నారు. మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే మరమ్మతు పనులు ప్రారంభమవుతాయన్నారు.

కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతామ‌న్నారు. విద్యుత్ కొనుగోళ్లపై న్యాయ విచారణ జరగాలని నిండు సభలో వాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.. న్యాయ విచారణ అంటే వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అర్థం కావడం లేదన్నారు.

ఈ దేశ సంపద వనరులు దామాషా ప్రకారం పంచబడాలని రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారు.. జనాభా దామాషా ప్రకారం సంపద, పదవులు పంచాలని ఆయన ఎన్నికల ముందు కోరారు.. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ ఆలోచనలు అమలు చేస్తున్నామ‌న్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నాము.. వారి ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామ‌న్నారు. దేశంలో కులగనణ‌న‌ జరగాలని రాజీవ్ గాంధీ ఇచ్చిన పిలుపు విప్లవాత్మకమైనదన్నారు.

Next Story