కేసీఆర్‌ను గెలిపించాలనుకున్నాం.. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయ్యింది : దానం నాగేందర్

కేసీఆర్ ను గెలిపించాలనుకున్నాం.. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయ్యిందని బీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు.

By Medi Samrat  Published on  3 Dec 2023 2:32 PM GMT
కేసీఆర్‌ను గెలిపించాలనుకున్నాం.. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయ్యింది : దానం నాగేందర్

కేసీఆర్ ను గెలిపించాలనుకున్నాం.. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయ్యిందని బీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం అని అన్నారు. ప్రతిపక్షంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామ‌ని తెలిపారు. ఆరు గ్యారెంటీలు అమలు విఫలం అయితే కాంగ్రెస్ పై పోరాటం చేస్తామ‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని గెలిపించాలని సంకల్పంతో పనిచేసామ‌న్నారు. కానీ కేసీఆర్‌ ఎన్ని అభివృద్ది కార్యక్రమాలు చేసినా ఎక్కడో మిస్‌ ఫైర్‌ అయిందన్నారు.

ఖైరతాబాద్ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా విజయం సాధించి.. రిటర్నింగ్ అధికారి నుండి సర్టిఫికెట్ తీసుకున్న అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామ‌న్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై, ఆరు గ్యారెంటీలు పూర్తి చేయడంలో ఎక్కడ విఫలం అయినా ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పై పోరాటం చేస్తామ‌న్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాలు నిలబెట్టేలా మా బాధ్యత పోషిస్తామ‌న్నారు.

ఇచ్చిన మాట తప్పతే దానిపై పోరాటం చేస్తామ‌న్నారు. నన్ను ఎన్నుకున్నందుకు ఖైరతాబాద్‌ ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌ లకు ధన్యవాదాలు. కాంగ్రెస్‌ అభ్యర్ధి విజయారెడ్డికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమె పోటీ చేసినందుకు నేను ఇంకా కృషి చేసాను. విజయరెడ్డికి సూచన ఆమె వెంట ఉండే వారే ఆమెను మోసం చేశారు. అలాంటి వారిని నమ్మవద్దు. విజయారెడ్డి నా బిడ్డ లాంటిదే.. కాని ఎన్నికల రణరంగంలో పోటీ చేసినపుడు బందుత్వం చూడలేమన్నారు.

Next Story