డీకే అరుణ ఏంఐఏంలోకి కూడా వెళ్తుంది : వంశీ చంద్ రెడ్డి
విలువలు, విధానాలు లేని వ్యక్తి డీకే అరుణ అని సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చంద్ రెడ్డి విమర్శించారు.
By Medi Samrat Published on 26 Jan 2024 8:55 AM GMTవిలువలు, విధానాలు లేని వ్యక్తి డీకే అరుణ అని సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చంద్ రెడ్డి విమర్శించారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవకాశవాద రాజకీయాలకు డీకే అరుణ మారుపేరని.. అసదుద్దీన్ ఓవైసీ పిలిస్తే డీకే అరుణ ఏంఐఏంలోకి కూడా వెళ్తుందన్నారు. డీకే అరుణ కంటే దగాకోరు అరుణ అంటే కరెక్ట్ సెట్ అవుతుందన్నారు. 2019లో 15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుండి మహబూబ్ నగర్ ఎంపీ గా పోటీ చేస్తానని డీకే అరుణ చెప్పింది. డీకే అరుణ డబ్బులు అడిగినట్టు ప్రమాణం చేయడానికి నేను రెడీ. ఏ రామ మందిరానికి రమ్మన్నా నేను వస్తానని సవాల్ విసిరారు.
28వ తేదీ 11 గంటలకు మహబూబ్ నగర్ లోని టీచర్స్ కాలనీలోని రామ మందిరానికి వస్తాను.. రాముడి భక్తురాలు నేనా, డీకే అరుణ నా అనేది తెలిపొద్దన్నారు. డీకే అరుణ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం అని విమర్శించారు. పూటకో పార్టీ మార్చే వ్యక్తి డీకే అరుణ.. డీకే అరుణ పేరు పలకాలి అంటే నాకు సిగ్గుగా ఉందన్నారు. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే నేను ఏఐసీసీ మెంబర్.. డీకే అరుణ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిని అని వివరించారు.
కాంగ్రెస్ పార్టీకి డీకే అరుణ వెన్నుపోటు పొడిచిందన్నారు. డీకే అరుణది నాకంటే గొప్ప రాజకీయ చరిత్ర ఏం కాదన్నారు. నేను డబ్బులకి అమ్ముడుపోయే వ్యక్తిని అయితే డీకే అరుణ లాగా బంగ్లాలపై బంగ్లాలు కట్టుకునే వాడినన్నారు. డీకే అరుణ మొన్న ఎన్ని డబ్బులు తీసుకొని గద్వాలలో పోటీ చేయలేదో ప్రజలకి చెప్పాలన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు.