జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడగా ఈరోజు తిరిగి ప్రారంభమై హోరాహోరీగా సాగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చివరికి కాంగ్రెస్ పార్టీ జనగామ మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం సభ్యుల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి 16 ( 15+1 Ex_officio ) మంది, బీఆర్ఎస్ పార్టీకి కూడా 16 ( 15+1 Ex_officio ) మంది సభ్యులు ఉండటంతో అధికారులు డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి కడకంచి బాలమణి పేరు రావడంతో జనగామ చైర్మన్ స్థానం కాంగ్రెస్ పార్టీకి దక్కింది.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ముందు, ఆ దేవుడి తీర్పు ముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి రౌడీ రాజకీయం, డబ్బు రాజకీయం ఓటమి పాలయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ అబ్జర్వర్ ఆలేరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు లకావత్ ధన్వంతీ, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.