అదే నిజమైతే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు..? : మోదీకి వీహెచ్ సూటి ప్ర‌శ్న‌

25 లక్షల మందిని దారిద్ర్య‌ రేఖకు దిగువన ఉన్న వాళ్ళను పైకి తీసుకు వచ్చాం అని మోదీ అంటున్నాడు.. అదే నిజం అయితే..

By Medi Samrat  Published on  8 May 2024 5:31 PM IST
అదే నిజమైతే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు..? : మోదీకి వీహెచ్ సూటి ప్ర‌శ్న‌

25 లక్షల మందిని దారిద్ర్య‌ రేఖకు దిగువన ఉన్న వాళ్ళను పైకి తీసుకు వచ్చాం అని మోదీ అంటున్నాడు.. అదే నిజం అయితే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు..? అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ వీ. హనుమంత‌ రావు ప్ర‌శ్నించారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో విఫలం అవుతున్నాం.. మోదీ పదేళ్లలో ఏం చేశాడో చెప్పడానికి ఏం లేదన్నారు. మరోసారి మోదీ వస్తే.. అదానీ, అంబానీలను కోటీశ్వరులు చేస్తాడు తప్ప పేదలకు ఏం చేయడన్నారు.

రాహుల్ గాంధీ కుల గణన చేపడతాం అంటున్నాడు.. ఓబీసీ నీ సపరేట్ చేసింది రాహుల్ గాంధీ.. దేశం సమిష్టిగా ఉండాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు. ఆంధ్రలో హిమములకు ఐదు వేల పెన్షన్ అంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ముస్లిములు కాదా ..? అని ప్ర‌శ్నించారు. స్వతంత్ర్యం తెచ్చింది మహాత్మా గాంధీ.. బీజేపీ మీడియా పబ్లిసిటీ అసత్య ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం దిన‌స‌రి వేతనం రూ.400 తప్పక చేస్తామ‌న్నారు.

Next Story