ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీ 'బీసీ సీఎం' డ్రామా : వీహెచ్‌

బీసీని సీఎం చేస్తామని బీజేపీ అంటోది.. చాలా గొప్ప విషయం.. ముస్లీం రిజర్వేషన్ తీసేస్తాం అంటున్నారు..

By Medi Samrat  Published on  30 Oct 2023 12:58 PM GMT
ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీ బీసీ సీఎం డ్రామా : వీహెచ్‌

బీసీని సీఎం చేస్తామని బీజేపీ అంటోది.. చాలా గొప్ప విషయం.. ముస్లీం రిజర్వేషన్ తీసేస్తాం అంటున్నారు.. ఇదేం లెక్క అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు ప్ర‌శ్నించారు. ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో మాట్లాడుతూ.. మోదీని బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని కోరాం.. చేయలేదు.. బీసీ క్రిమిలేయర్ ఎత్తివేయాలని కోరాం.. చేయలేదు అని వెల్ల‌డించారు. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ని దింపి.. కిషన్ రెడ్డిని పెట్టిండ్రు.. ఎన్నికల్లో ఓట్ల కోసమే బీసీ సీఎం డ్రామా అని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ పెంచాలని ఆయ‌న డిమాండ్ చేశారు. బీసీ సీఎం అని.. మోసం చేయాలని.. ముస్లిం నోట్లో మట్టి కొట్టాలని బీజేపీ చూస్తుందన్నారు.

రాహుల్ ప్రధాని ఐతే బీసీ కులగణన చేపడతామ‌న్నారు. కాంగ్రెస్ వేవ్ నడుస్తోందన్నారు. మైనార్టీలు కూడా ఆలోచన చేయండని పిలుపునిచ్చారు. ఓబీసీ కులగణన చేసి.. కేసీఆర్ బయటపెట్టలేదన్నారు. నితీష్ కుమార్ చేసిండు, తమిళనాడు, ఒరిస్సా లో కూడా చేస్తున్నారని వివ‌రించారు. బీజేపీ రిమోట్ కంట్రోల్ నాగపూర్‌లో మోహన్ భగవత్ వద్ద వుందన్నారు. బీసీలను మోసం చేయడానికి బీసీ సీఎం అంటున్నారని ఆరోపించారు.

అంబర్ పేట టికెట్ ఆశించిన నూతి శ్రీకాంత్ కు టికెట్ ఇవ్వదని నేనే చెప్పాను. నన్ను తిట్టినోడికి, కొట్టినోడికి.. నేను టికెట్ ఇప్పించాలా అని ప్ర‌శ్నించారు. రోహిన్‌ రెడ్డిని గెలిపించడానికి కృషి చేస్తాన‌న్నారు.

Next Story