కేటీఆర్.. నువ్వు తక్షణమే నార్కోటిక్ టెస్ట్ చేయించుకో.. : షబ్బీర్ అలీ

కేటీఆర్, ఆయన బామ్మర్ది ఒకసారి నార్కోటిక్ టెస్ట్ చేయించుకుంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు

By Kalasani Durgapraveen  Published on  28 Oct 2024 12:10 PM
కేటీఆర్.. నువ్వు తక్షణమే నార్కోటిక్ టెస్ట్ చేయించుకో.. : షబ్బీర్ అలీ

కేటీఆర్, ఆయన బామ్మర్ది ఒకసారి నార్కోటిక్ టెస్ట్ చేయించుకుంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నువ్వు తక్షణమే నార్కోటిక్ టెస్ట్ చేయించుకొని సర్టిఫికెట్ చూపించు అని సూచ‌న చేశారు.

డ్రగ్స్ కు కేటీఆర్ కు ఏం సంబందం.? డ్రగ్స్ అనగానే ప్రతి సారి కేటీఆర్ ఎందుకు స్పందిస్తున్నాడ‌ని ఫైర్ అయ్యారు. ఇల్లీగల్ గా అక్కడికి పారిన్ లిక్కర్ ఎందుకు వచ్చింది.? కేటీఆర్ కు సిగ్గు శరం ఉందా.? అని ధ్వ‌జ‌మెత్తారు. కేటీఆర్ బామ్మర్ది జన్వాడ పామ్ హౌస్ లో పేకాట, డ్రగ్స్, క్యాషియోతో అడ్డంగా దొరికిపోయిండు.. హవాయ్ చెప్పులు వేసుకున్న కేసీఆర్ కుటుంబానికి ఇన్ని కోట్లు ఎక్కడినుండి వచ్చినవి అని ప్ర‌శ్నించారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల 50 మంది ఆస్తులపై వెంటనే విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జన్వాడ పామ్ హౌస్ పై వాస్తవాలు చూపించినందుకు ఆరోజు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని 40 రోజులు జైల్లో పెట్టారు. అండర్ ట్రయల్ ముద్దాయిగా పెట్టి రేవంత్ రెడ్డిని చంపాలని చూశారని ఆరోపించారు. ప్రతి వారం ఫాంహౌస్‌లో రాజ్ పాకాల రేవ్ పార్టీ నిర్వహిస్తాడని.. పక్కా సమాచారంతోనే పోలీసులు దాడి చేశారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త్వరలో వాస్తవాలు అన్ని ప్రజల ముందు పెడతామ‌న్నారు.


Next Story