బీజేపీది హిందు ఏక్తా యాత్ర కాదు.. హిందువులను విడగొట్టే యాత్ర

Congress Senior Leader Mallu Ravi Fire on BJP. బీజేపీ వాళ్ళది హిందు ఏక్తా యాత్ర కాదు.. హిందువులను విడగొట్టే యాత్ర అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

By Medi Samrat  Published on  15 May 2023 11:51 AM GMT
బీజేపీది హిందు ఏక్తా యాత్ర కాదు.. హిందువులను విడగొట్టే యాత్ర

బీజేపీ వాళ్ళది హిందు ఏక్తా యాత్ర కాదు.. హిందువులను విడగొట్టే యాత్ర అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. కరీంనగర్ లో నిన్న బీజేపీ త‌ల‌పెట్టిన హిందు ఏక్తా యాత్ర హిందువుల మద్య చిచ్చు పెట్టె యాత్ర లా ఉందన్నారు. బీజేపీ పార్టీ పుట్టకముందే హిందు మతం ఉందని.. అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారు. హిందువులు అంటే బీజేపీ ఒక్కటే కాదని పేర్కొన్నారు. బీజేపీ మతం అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ హిందువుల మధ్య చిచ్చు పెడుతుందని విమ‌ర్శించారు.

హిందువుల ఏక్తా యాత్ర అంటూ బీజేపీ హిందువుల మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నదన్నారు. కాంగ్రెస్ లోనే కాదు అన్ని పార్టీ లలో హిందువులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు. వాళ్ళు కూడా దేవుళ్లను పూజిస్తారన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తే అవ్వి ఎప్పటికి ఫలించవని హితువు ప‌లికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముణ్ణి, హనుమంతుడిని, శంకరుణ్ణి, బాగ్యాలక్మిని అందరిని పూజిస్తారని పేర్కొన్నారు.

హిందు మత సంప్రదాయాలు బీజేపీ పుట్టిన తర్వాత రాలేదు.. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయని అన్నారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక కేవలం మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు నడిపిస్తున్నారన్నారు. ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి చాలాకాలం రాజకీయాలు నడపలేరన్నారు. ప్రజలు బీజేపీ మత రాజకీయాలు గమనిస్తున్నారు.. తగిన విదంగా బుద్ధి చెబుతార‌ని అన్నారు.


Next Story