రోడ్లపై రాజకీయాలు చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు.. హరీష్ రావు, కేటీఆర్‌లకు కాంగ్రెస్ ఎంపీ వార్నింగ్‌..!

మాది ప్రజా పాలన.. మీ నిర్బంధాలు మర్చిపోయారా..? అంటూ హరీష్ రావు, కేటీఆర్‌లపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు.

By -  Medi Samrat
Published on : 8 April 2026 12:06 PM IST

రోడ్లపై రాజకీయాలు చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు.. హరీష్ రావు, కేటీఆర్‌లకు కాంగ్రెస్ ఎంపీ వార్నింగ్‌..!

మాది ప్రజా పాలన.. మీ నిర్బంధాలు మర్చిపోయారా..? అంటూ హరీష్ రావు, కేటీఆర్‌లపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగచేస్తూ రోడ్లపై రాజకీయాలు చేస్తాం అంటే ప్రభుత్వం ఊరుకోదని, చట్టం తన పరిధిలో పని చేస్తుందని హెచ్చ‌రించారు. రాజకీయ లబ్ది కోసం హరీష్ రావు రోజుకొక డ్రామా చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.. అబద్దాల పునాదులపై రాజకీయాలు చేస్తూ పూట గడుపుకుంటున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మరన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రుల నేతృత్వంలోని ప్రజా పాలన ఈ రెండున్నర ఏళ్లలో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇచ్చిన హామీల అమలు విషయంలో గతంలో ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ, ఏ రాష్ట్రంలో కూడా చేయనంతగా చేసి చూపెట్టాము.. మీ బీఆర్ఎస్ పాలనలో 9 ఏళ్ళు ఎంత నిర్బంధం అమలు చేశారో ప్రజలకు తెలుసు.. ఇప్పుడు దయ్యాలు వేదాలు వళ్ళించినట్టు అక్రమ అరెస్టులు, నిర్బంధం అని మాట్లాడితే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని ఎద్దేవా చేశారు.

ఒక చిన్న నిరసన కార్యక్రమానికి పిలుపు ఇస్తే చిన్న మండల నాయకుడి నుంచి పీసీసీ అధ్యక్షుడు వరకు అందరిని గృహ నిర్బంధం చేసిన చరిత్ర మీది.. తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండరామ్ ను అర్థరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి అక్రమ అరెస్టులు చేశారు.. లేని కేసులు పెట్టి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి బెడ్ రూమ్ లోనించి లాక్కెళ్లారు.. అవన్నీ నిర్బంధాలు కావా.. అసలు ఇప్పుడు నిర్బంధాలు ఉన్నాయా.. ఉంటే మీరు బయటకు వచ్చే వారా.. మేము అత్యంత ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా పాలన చేస్తున్నామన్నారు. ప్రజలు మీ పాలన..మా పాలన రెండు చూస్తున్నారు.. వాళ్లే నిర్ణయిస్తారన్నారు.

Next Story