ఆమె జైలుకు వెళ్లొచ్చాక, బయట కనిపించాలని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి వచ్చాక బయట కనిపించాలని ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ఎంపీ చామల ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 8 April 2025 12:17 PM

Telangana, Hyderabad, Congress, Mp Chamala, Brs, Mlc Kavitha, HCU

ఆమె జైలుకు వెళ్లొచ్చాక, బయట కనిపించాలని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కేసు వేయగానే హెచ్‌సీయూపై పెట్టిన పోస్టులు కిషన్ రెడ్డి డిలీట్ చేశారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డిని చూసి మిగతా వారు కూడా పోస్టులు డిలీట్ చేశారు. ఏఐతో లేని బొమ్మలను క్రియేట్ చేసి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని కేటీఆర్ చూస్తున్నారు. నెగిటివ్ పాలిటిక్స్, నెగిటివ్ పాలసీలు అని కేటీఆర్ అంటున్నారు.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ చేయడం, రాంగ్ పాలసీనా కేటీఆర్ చెప్పాలి?. ప్రజలను రెచ్చగొట్టడానికే లేనివి ఉన్నవిగా చూపిస్తున్నారు..అని ఎంపీ చామల ఆరోపించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి వచ్చాక బయట కనిపించాలని ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ఎంపీ చామల ఆరోపించారు. అసెంబ్లీలో జ్యోతిరావుపూలే విగ్రహం పెట్టాలని కవిత అంటున్నారు. మీ తండ్రి కేసీఆర్ కట్టిన ప్రగతిభవనాన్ని కంచె కూల్చి జ్యోతిరావు పూలే పేరు పెట్టింది నిజం కాదా? అని ఎంపీ చామల ప్రశ్నించారు. కేసీఆర్ మాదిరి ఏకపాత్రాభినయం కాంగ్రెస్ చేయడంలేదు. హెచ్‌సీయూపై మాట్లాడుతున్న బండి సంజయ్ తెలంగాణకు రాగానే కార్పొరేటర్ అవుతారు. సీబీఐ విచారణ జరిపిస్తాం చెబుతున్నారు. 2003లో ప్రధాని వాజ్‌పేయి, సీఎం చంద్రబాబే కదా? సీబీఐ కాదు సీబీఎన్ ఎంక్వయిరీ చేయించాలి. విచారణ చేస్తే ఐఎన్‌జీ సంస్థ యజమానిని చేయాలి. గోపన్‌పల్లిలో ఉన్న 400 ఎకరాలను కాపాడింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒకటేనని బండి సంజయ్ అంటున్నారు. డీ లిమిటేషన్ కోసం చెన్నై వెళ్తే ఒక్కటి అయినట్టేనా? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగవద్దు అని రేవంత్ పోరాటం చేస్తున్నారు..అని ఎంపీ చామల పేర్కొన్నారు.

Next Story