ప్రతిపక్ష పార్టీగా.. రూలింగ్ పార్టీకి పరిపాలనకు అవకాశం ఇవ్వాలి : ఎంపీ చామల
FTL లో ఎవరి భూములు ఉన్న ఆధారాలు ఇస్తే కూలగొడతామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 21 Aug 2024 5:35 PM ISTFTL లో ఎవరి భూములు ఉన్న ఆధారాలు ఇస్తే కూలగొడతామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.. FTL లో ఎక్కువ కాంగ్రెస్ మంత్రుల ఫామ్ హౌస్‌లే ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం రోడ్డు మీద పెట్టాలని చూశారు.. మేము గుండెల్లో పెట్టు కోవాలని చూస్తున్నామని.. అందుకే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సీఎం రేవంత్ చూస్తున్నారని అన్నారు. పది ఏండ్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టక మీరు గాడిద పండ్లు తోమారా అని ఫైర్ అయ్యారు.
కేటీఆర్ చెప్పిందే కరెక్ట్ అనుకుటుండు.. రిప్లై ఇద్దామంటే కేటీఆర్ నా అకౌంట్ బ్లాక్ చేసిండు.. వాళ్ళ చిల్లర ముఠా బ్లాక్ చేస్తుంది.. వాళ్ళు సునకానందం పడుతున్నారని అన్నారు. రూలింగ్ పార్టీకి పరిపాలించడానికి.. ప్రతిపక్ష పార్టీగా అవకాశం ఇవ్వాలన్నారు.
పది ఏండ్లు అధికారంలో ఉండి జన్వాడ పామ్ హౌస్ ను లిజుకు తీసుకున్న అన్నప్పుడే మీ పరిస్థితి ఏంటి అనేది అర్థం అయ్యింది.. ఫిరంగి కాల్వలను పూడ్చి పామ్ హౌస్ కట్టిన మీకు.. ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని చూస్తే.. రేవంత్ రెడ్డిని తీవ్ర వాదులు ఉండే జైల్లో పెట్టారని అన్నారు. ఇల్లీగల్ నిర్మాణాలను కూలగొట్టాలని చెప్పిన కేటీఆర్.. స్టే కోసం కోర్టుకు పోయిండని ఎద్దేవా చేశారు.
FTL, బఫర్ లో ఉన్న ఎవరి భూములైన కూల గొట్టాల్సిందే.. మీకు ఇబ్బందులుంటే లిఖిత పూర్వకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఇవ్వండని సూచించారు. హైడ్రా పారదర్శకంగా పని చేస్తుందన్నారు. హైడ్రాలో పేదలకు అన్యాయం జరిగితే.. వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కేటీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాడమే లక్ష్యంగా పెట్టుకుండని విమర్శించారు. పది ఏండ్లు పరిపాలించిన మీరు.. పది మాసాలు కానీ మా ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారు.. ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారని అన్నారు. రుణమాఫీకి రూ.31 వేల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టాలని ప్రభుత్వం అనుకుంది. ఇంకా రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదన్నారు.