కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలకు 'అపరిచితుడు' సినిమా తరహా శిక్షలు పడాలి
కేసీఆర్ ఫాం హౌస్‌లో కూర్చొని కొత్త వేషంలో ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 16 Aug 2024 4:56 PM ISTకేసీఆర్ ఫాం హౌస్‌లో కూర్చొని కొత్త వేషంలో ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు, కేటీఆర్ లు బరితెగించి కాంగ్రెస్ ఏ మంచి పని చేసినా విషం చిమ్ముతున్నారని.. వారిద్దరూ ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు అర్ధం అవుతుందని అన్నారు. హరీష్ రావు దేవుడి పేరుతో దైవద్రోహం అని విమర్శిస్తున్నారు. 8 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేశామన్నారు. అపరిచితుడు సినిమాలో ఉండే శిక్షలు.. నరకంలో ఉండే శిక్షలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలకు పడాలన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకు తిన్న మీరు.. దేవుడి పేరు తీసుకోవడం విడ్డూరం అన్నారు.
కేటీఆర్ మహిళల మీద అనుచిత వాఖ్యలు చేస్తున్నారు.. నీకు ఏం సంస్కారం నేర్పారని ప్రశ్నించారు. కేటీఆర్ ఆంధ్రాలో చదువుకుంటే.. ఆ సంస్కృతి అయిన రికార్డింగ్ డ్యాన్సులు వంటపట్టయా..? రికార్డింగ్ డాన్స్ లు తెలంగాణ సంస్కృతి కాదు.. కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్, హరీష్ రావులు సిరిసిల్ల, సిద్దిపేటలో కాకుండా బయటకు వచ్చి పోటీ చేస్తే తెలుస్తుందన్నారు. హరీష్ రావు ఇరిగేషన్. శాఖ మంత్రిగా ఉండి అన్ని అవినీతి ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. పదేళ్లలో తెలంగాణ లక్షా ముప్పైవేల కోట్ల అప్పులు రాపేమెంట్ చేయాలి.. ఇంకా విమర్శలు చేస్తున్నారు అంటే.. మీ ఒంట్లో సిగ్గు శరం లేదని విమర్శించారు. మీ విధ్వంసకర పాలన నుంచి.. తెలంగాణ విముక్తి అయ్యిందన్నారు. తెలంగాణకు దిష్టి చుక్కలుగా కేటీఆర్, హరీష్ రావులు మిగిలిపోయారన్నారు. కాగ్నిజెంట్ శంకుస్థాపన ఎలా సాధ్యం అని కేటీఆర్ విమర్శిస్తున్నారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధి చూసి పెట్టుబడులు పెడుతుంటే.. శంకుస్థాపనలు చేశారు. మీరు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు అని తెలిసి వెనకడుగు వేశారు. మీ క్రిడిబులిటీ ఏంటి అనేది వాళ్లకు అర్ధం అయ్యిందయ్యారు.
రేవంత్ రెడ్డి సోదరులు పాలన చేస్తున్నారు అనడానికి సిగ్గు ఉండాలన్నారు. ఆయన సోదరులకు రాజ్యసభ ఇచ్చాడా.. కాంట్రాక్టులు ఇచ్చారా.. ఏం చేశారు.. అలాంటి దగుల్బాజీ పనులు చేసింది మీరు అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సోదరుడు బీజేపీలో యువ మోర్చా గా పని చేశారు.. తిరుపతి రెడ్డి కూడా బీజేపీలో కీలకంగా గతంలో పని చేశారు.. మీలాగా ప్యారాష్యూట్ వేసుకొని రాలేదన్నారు. దరిద్రమైన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు.. కాస్త ఓపిక పట్టండన్నారు. కాంగ్రెస్ తప్పిదాలు చేస్తే.. ఎండగట్టిండి.. మీ రాజకీయ బొంద మీరే పెట్టుకుంటున్నారని అన్నారు.
మీ ఎమ్మెల్యేలకు మీ మీదే నమ్మకం లేదు. హరీష్ రావు ప్రతిపక్ష నేత కుర్చీలో కూర్చోవాలి అని రోజు హంగామా చేస్తున్నారు.. ముక్కు నేలకు రాసినా.. కల్వకుంట్ల కుటుంబం నీకు ఏ పదవి ఇవ్వదు హరీష్ రావు.. కష్టపడే నాయకుడు అనే కొంత పేరు ఉంది.. దానిని కాపాడుకుంటే రాజకీయ భవిష్యత్ ఉంటుందని హితువు పలికారు. తెలంగాణ విధ్వాసానికి నువ్వు కూడా కారణం హరీష్ రావు.. అందుకే కొంత కాలం సైలెంట్ గా ఉండి.. తప్పులు సరిదిద్దుకో అని సలహా ఇచ్చారు.