బురద రాజకీయం చేయకండి.. బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీష్ రావుకి నచ్చట్లేదని మహబూబ్‌గర్ ఎమ్మెల్యే యోన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 4 Sep 2024 10:00 AM GMTకాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా హరీష్ రావుకి నచ్చట్లేదని మహబూబ్‌గర్ ఎమ్మెల్యే యోన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో నామట్లాడుతూ.. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండీ భవిషత్తును దృష్టిలో పెట్టుకొని ఏ మంచి కార్యక్రమం చేయలేదన్నారు. తెలంగాణలో 90 శాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్ఎస్ నాయకులేనని.. నేను ప్రూవ్ చేయడానికి సిద్ధం.. ఆ పాపం అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు దేనన్నారు. మామా అల్లుళ్ళకు శిక్ష పడటం ఖాయం అన్నారు. ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికే హరీష్ రావు దేవుళ్ళ దగ్గరకు పోతుండని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలను తొలగించడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చారని అన్నారు. కేటీఆర్ కేవలం ట్విట్టర్ లో లొల్లి పెట్టడానికే పనికొస్తడన్నారు. కేటీఆర్ తొందరపడి మాట్లాడి తర్వాత క్షమాపణ చెప్పడంలో గిన్నిస్ బుక్ రికార్డ్ లకు ఎక్కిండన్నారు. వరంగల్ లో బీభత్సం జరగడానికి కారణం చెరువుల ఆక్రమణ అన్నారు. బీఆర్ఎస్ పది సంవత్సరాలు కండ్లు మూసుకొని ఉండబట్టే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు.
హైదరాబాద్ నగరాన్ని శుద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి మూసి రివర్ ప్రక్షాళన చేపట్టారని అన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని పట్టణాలలో రెవిన్యూ భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. ఏనాడు కేసీఆర్, వాళ్ళ నాయకులకు కాపాడే సోయి రాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వాటిని వెనుకకు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. పెద్ద పట్టణాలలో.. మున్సీపాలిటిలలో హైడ్రాను ఉపయోగించి అక్రమ కట్టడాలను తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను స్వాగతించండన్నారు. ప్రభుత్వంపై బురద జల్లి, బురద రాజకీయం చేయకండని సూచించారు.