ప్ర‌భుత్వంపై హైకోర్టును ఆశ్ర‌యించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌

నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే సీతక్క హైకోర్టును

By Medi Samrat  Published on  29 Sep 2023 8:38 AM GMT
ప్ర‌భుత్వంపై హైకోర్టును ఆశ్ర‌యించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క‌

నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే సీతక్క హైకోర్టును ఆశ్ర‌యించారు. ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని సీతక్క హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నందున తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని సీతక్క తన పిటిషన్ లో పేర్కొన్నారు. సీడీఎఫ్ నిధుల‌ మంజూరులో జిల్లా మంత్రి ప్రమేయం చట్ట విరుద్ధమని.. జిల్లా మంత్రి ఆమోదంతో నిధులు మంజూరు చేయాలన్న జీవో 12 కొట్టేయాలని కోరుతూ సీతక్క కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

సీతక్క పిటిషన్ పై కోర్టులో న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ తన వాదనలు వినిపించారు. వెంటనే నిధులు విడుదలకు ఆదేశించాలని సీతక్క తరుపున న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ కోర్టు ను కోరారు. ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాద, ప్రతివాదన‌లు విన్న తర్వాత తదుపరి విచారణను అక్టోబరు 9కి వాయిదా వేసింది న్యాయ‌స్థానం.

Next Story