పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని.. మీ అవినీతిలో నేను భాగస్వామిని కావొద్దనే పార్టీమారానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నేను ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే.. జనగామ గడ్డపై ముక్కు నేలకు రాస్తానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాలు దోచుకున్నారని.. ఫామ్‌హౌస్‌లు, ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. జైలుకు వెళ్తాడని కేటీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు.
కేటీఆర్, హరీశ్ రావును పిచ్చికుక్కలు కరిచినట్లు అనుమానంగా ఉందని కడియం శ్రీహరి తెలిపారు. రోజూ మీడియాలో ఉండాలనే తపన తప్ప మరేం కనిపించడం లేదన్నారు. కేటీఆర్ కు జైలు భయం పట్టుకుంది. కేసీఆర్, కేటీఆర్ తప్పులు ఇప్పుడు ఒక్కొక్క టిగా బయపడుతున్నాయన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు.. వనరులను కొల్లగొట్టి వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. మీ అవి నీతిలో భాగస్వామి కావొద్దనే బీఆర్ఎస్ నుంచి బయట కువచ్చానని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.