నా పేరే హనుమంతుడు.. నాకన్నా భక్తుడు ఎవరు..? : వీహెచ్‌

మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎంపీ హనుమంత రావు అన్నారు

By Medi Samrat  Published on  11 Sept 2024 4:00 PM IST
నా పేరే హనుమంతుడు.. నాకన్నా భక్తుడు ఎవరు..? : వీహెచ్‌

మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎంపీ హనుమంత రావు అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి చాకలి ఐలమ్మ గుర్తుకు రాలేదని విమ‌ర్శించారు. దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ కు రాలేదు.. 1948 నల్గొండ జిల్లా శాలి గౌరారం వల్లలా గ్రామంలో స్కూల్ విద్యార్థులు జాతీయ పతాకం ఎగురవేసినందుకు 8 మందిని అప్పటి పాలకులు కాల్చి చంపారు. ఆ గ్రామంలో చరిత్రకు సాక్ష్యంగా సమాధి నిర్మిస్తాం. సెప్టెంబర్17న పునాది వేస్తామ‌న్నారు.

విమోచన దినోత్సవంకు అమిత్ షా వస్తున్నారు అని బీజేపీ అంటుంది. సాయుధ పోరాటంలో బీజేపీ లేనే లేదన్నారు. కాంగ్రెస్.. MIM కి భయపడి సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపడం లేదని అంటున్నారు. కాంగ్రెస్‌కు MIM కు ఏం సంబంధం.. మాది సెక్యులర్ సిద్ధాంతం. దేవుడి పేరుతో రాజకీయాలు చెయ్యం అన్నారు. నా పేరే హనుమంతుడు.. నాకన్నా భక్తుడు ఎవరు..? అని ప్ర‌శ్నించారు.

పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు చీరెలు గాజులు పంపిస్తాం అంటున్నారు.. మరి అప్పుడు ఏం చేశారు.. ఎవరి గుణపాఠం వాళ్ళకేన‌న్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నప్పుడు ఏం చేశారని ప్ర‌శ్నించారు. ఇప్పటికైనా మీ ఆలోచనల్లో మార్పు రావాలల‌న్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద అప్పటి గవర్నర్ నరసింహన్ ను కలిసేందుకు వెళితే.. అరెస్టు చేసి.. నాకున్న సెక్యూరిటీని కూడా తొలగించారన్నారు.

Next Story