ఆ రెండు డిక్లరేషన్స్ కూడా రాహుల్, ప్రియాంక ప్ర‌క‌టిస్తారు : షబ్బీర్ అలీ

గతంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని.. లక్షల మంది విద్యార్థులు

By Medi Samrat  Published on  1 Nov 2023 3:00 PM IST
ఆ రెండు డిక్లరేషన్స్ కూడా రాహుల్, ప్రియాంక ప్ర‌క‌టిస్తారు : షబ్బీర్ అలీ

గతంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని.. లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. గాంధీభవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అన్నారు.. ఏమైందని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఇస్లామిక్‌ కల్చరల్ సెంటర్స్, మైనారిటీలకు ఇల్లు అన్నారు.. ఏ ఒక్కటీ అమ‌లు కాలేదన్నారు. మేము మైనారిటీలకు 55 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు ఆరు మాత్రమే ఉన్నాయన్నారు. మైనార్టీలకు కేసీఆర్ చేసింది శూన్యం అన్నారు. మైనార్టీలకు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం కోసం రెండు సార్లు అప్లికేషన్లు తీసుకున్నారు. కానీ ఏ ఒక్కరికి సహాయం చేయలేదన్నారు.

రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్, ప్రియాంక యూత్ డిక్లరేషన్, సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్స్ ప్ర‌క‌టించార‌ని తెలిపారు. త్వరలో మైనార్టీ, బీసీ డిక్లరేషన్స్ రాహుల్, ప్రియాంక లచేత ప్ర‌క‌టింప‌ చేస్తామ‌ని తెలిపారు. రూ. 50,00 కోట్లతో మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని సూచించామ‌ని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్స్ పెంపు కోసం లీగల్ గా వెళ్తామ‌న్నారు. 4 శాతం రిజర్వేషన్స్ కి పూర్తిగా ప్రొటెక్షన్ కల్పిస్తామ‌ని తెలిపారు. స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల సహాయం అంద‌జేస్తామ‌న్నారు. మైనార్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. రేపు లేదా ఎల్లుండి మిగిలిన అభ్యర్థుల లిస్ట్ వస్తుంద‌న్నారు. నేను ఎక్కడ పోటీ చేయాలనేది సీఈసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Next Story