పోలీసులు పెట్టిన సెక్షన్స్ వల్ల.. నా ఫిర్యాదు నిరుగారిపోతోంది: రేవంత్‌ రెడ్డి

Congress leader Revanth Reddy's latest remarks. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

By అంజి  Published on  16 Feb 2022 11:30 AM GMT
పోలీసులు పెట్టిన సెక్షన్స్ వల్ల.. నా ఫిర్యాదు నిరుగారిపోతోంది: రేవంత్‌ రెడ్డి

అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తాను పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన ఇవాళ్టి ఉదయం వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్స్‌ సంతృప్తికరంగా లేవన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్స్‌ వల్ల తన ఫిర్యాదు నిరుగారిపోతోందని రేవంత్‌ అన్నారు. సెక్షన్స్ సంతృప్తికరంగా లేవు కాబట్టే మళ్ళీ ఫిర్యాదు చేసానన్నారు. మళ్లీ కొత్త ఎఫ్‌ఐఆర్‌లో బలమైన సెక్షన్స్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల వల్ల తాను చేసిన ఫిర్యాదు రూపమే మారిపోతుందన్నారు.

రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు ఎఫ్.ఐ ఆర్ నమోదు చేశారు. ఇది ఆపరేషన్ సక్సెస్ బట్ పేషేంట్ డెడ్ లాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ఇలాంటి నామమాత్రంగా కేసులు నమోదు చేశారని అనుమానాలు కలుగుతున్నాయి మహిళలను అత్యంత నీచంగా కించపరిచే విధంగా మాట్లాడిన హిమంత్ పైన బలమైన కేసులు నమోదు చెయ్యాలి. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోని అస్సాం ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలి. పోలీసులు కేసును నిరుగారిస్తే న్యాయస్థానంలో కొట్లాడుతాం. వంద లాదిమంది పిల్లలు ఉద్యోగాలు లేక మృత్యువాత పడుతుంటే- కేసీఆర్ పిల్లలు మాత్రం కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజులు జరుపుకుంటున్నారు. కరోనా సమాజం అంతా దుఃఖంలో ఉంటే మూడు రోజులు జన్మదిన వేడుకలు ఎలా చేసుకుంటారు?. అంటూ ప్రశ్నించారు.

17వ తేదీన యూత్ కాంగ్రేస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గాడిదకు జన్మదిన వేడుకలు చేయాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. కేసీఆర్ పుట్టినరోజు కానుకగా లక్ష నోటిఫికేషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. మోడీకి యూపీలో మేలు చేయడానికే కేసీఆర్‌ సుపారీ తీసుకోని మాట్లాడుతున్నారని రేవంత్‌ అన్నారు. మూడో కూటమి వస్తే యూపీఏ కూటమి బలహీనపడి- ఎన్డీఏ కూటమి బలపడుతుందన్నారు.

Next Story
Share it