ఈ రోజు, రేపు తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
Congress leader Rahul Gandhi to visit Telangana today.
By తోట వంశీ కుమార్ Published on 6 May 2022 4:21 AM GMTతెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ నేడు రాష్ట్రానికి రానున్నారు. మూడేళ్ల తరువాత రాష్ట్రానికి వస్తున్న రాహుల్.. రాష్ట్ర కాంగ్రెస్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం అయిన తరువాత రాహుల్ తొలి పర్యటన ఇది. నేటి(శుక్రవారం) సాయంత్రం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు సంఘర్షన సభలో రాహుల్‌గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామనేది ఈ సభలో ప్రకటించే అవకాశం ఉంది.
శుక్రవారం రాహుల్‌గాంధీ హాజరయ్యే రైతు సంఘర్షణ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారిగా ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు.. రాహుల్ సభ విజయవంతానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక మైదానంలో మూడు వేదికలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రాహుల్ ప్రసంగించే ప్రధాన వేదికతో పాటు రైతులు, కళాకారుల కోసం మరో రెండు వేదికలను వేర్వేరుగా సిద్ధం చేశారు.
రాహుల్ పర్యటన వివరాలిలా..
- శుక్రవారం సాయంత్రం 4:50కి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాహుల్ గాంధీ చేరుకుంటారు.
- 5:10కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు.
- 5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు.
- 6:05 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు.
- 8 గంటలకు వరంగల్ నుండి బై రోడ్ ద్వారా బయలుదేరి రాత్రి 10:40 హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో స్టే చేస్తారు.
రెండవ రోజు (శనివారం)
- శనివారం మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు.
- 12:50-1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు.
- 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు.
- 1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ ముఖ్యనేతలతో మీటింగ్ లో పాల్గొంటారు.
- 1:45నుంచి 2:50వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు.
- సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు.
- 5:50కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయల్థేరతారు.