జగన్, చంద్రబాబులది ఇదే పంచాయతీ.. ఏపీ ప్రజలు కాంగ్రెస్ గురించి ఆలోచన చేయండి..!
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయండని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 15 April 2024 6:35 PM ISTరాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయండని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారన్నారు. బిజెపి డబుల్ ఇంజన్ అంటే.. ఉన్న అప్పులను డబుల్ చేయడమేనని ఎద్దేవా చేశారు. బీజేపీ దేశాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. శ్రీరాముడి పేరు చెప్పి పబ్లిక్ ని పరేషాన్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ని 15 ఎంపీ సీట్లలో గెలిపించాలని కోరారు. 2014లో తులం బంగారం 28 వేలు ఉండేదని, మోదీ నాయకత్వంలో 75 వేలకు చేరుకుందని.. మహిళలు ఆలోచన చేయాలన్నారు. పుస్తె కూడా వేసుకునే పరిస్థితి లేదన్నారు. రాహుల్ గాంధీ వస్తే ధరల నియంత్రం ఉంటుందన్నారు.
AP లో రాళ్లతో కొట్టుకుంటున్నారు.. ఏపీ ప్రజలు కాంగ్రెస్ గురించి ఆలోచన చేయాలన్నారు. బీజేపీ నేతల ఆందోళనలు ఓట్ల దుకాణములో భాగమేనన్నారు. నెహ్రూ నుండి..మన్మోహన్ సింగ్ వరకు దేశం అప్పు 55 లక్షల కోట్లు కాగా.. మోదీ వచ్చినప్పటి నుండి కోటీ 13 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. డబుల్ ఇంజన్ అంటే అప్పులు తేవడంలో డబుల్ ఇంజన్.. బీజేపీ దేశాన్ని నాశనం చేసిందన్నారు. రాముడు ఎప్పుడైనా అప్పులు చేయండి అని చెప్పారా..? అని ప్రశ్నించారు.
మూడోసారి వచ్చి ఏం చేస్తారు.. అప్పులు చేసే ప్రధాని కాదు.. ప్రజా పాలన అందించాలి అనేది కాంగ్రెస్ విధానమన్నారు. దేశం అంతా తిరిగి రాహుల్ గాంధీ మంచి అవగాహన పెంచుకున్నారు.. రాముడు దేవుడు.. నాయకుడు కాదన్నారు. ఒక్క బీజేపీ నేత అయినా.. రాముడి కల్యాణం చేస్తాడా..? గుడికెళ్లి దీపం పెడతారా..? రాహుల్ గాంధీ కూడా రాముణ్ణి మొక్కుతారని.. కానీ కెమెరాలు పెట్టుకుని మొక్కడన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమన్నారు.. 15 సీట్లు గెలవాలని కేసీ టార్గెట్ పెట్టారని.. ప్రజలు సహకరించాలని కోరారు. రాహుల్ గాంధీని ప్రధాని ని చేసుకుంటే.. ఏ తలనొప్పి ఉండదన్నారు.
ఏపీలో రాళ్లుతో కొట్టుకుంటున్నారు.. కొట్టుకుంటే ఎమోస్తది.. జగన్ ని రాళ్లతో కొట్టారని టీడీపీ.. చంద్రబాబు కొట్టాడు అని జగన్.. ఇదే పంచాయతీ.. కాంగ్రెస్ గురించి ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి.. రాష్ట్ర విభజన తో మీకు ప్రత్యేక సీఎం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది కాదా అని ప్రశ్నించారు. మెదక్ లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తోందన్నారు. మోతిలాల్ నెహ్రు ఆస్తులు అన్నీ స్వతంత్ర ఉద్యమానికి ఇచ్చేశారు.. ఉండటానికి ఇల్లు కూడా లేదు. బీజేపీ లో అలాంటి నేత పేరు ఒక్కరైనా చెప్పగలుగుతారా..? అని సవాల్ విసిరారు. నెహ్రు జైల్ జీవితం గడిపారు.. ఇందిరా గాంధీ కూడా..చిన్న వయసులోనే జైలు జీవితం గడిపారన్నారు.