ఫుల్ ఫాం గురించి ఆలోచిస్తే ఐఐటీ వచ్చేది కాదు.. రఘునందన్ రావుకు జగ్గారెడ్డి కౌంటర్
ఎంపీ రఘునందన్ రావుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 14 Feb 2025 8:41 PM IST
ఎంపీ రఘునందన్ రావుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీఐఆర్ ఫుల్ ఫాం నాకు తెలియదు.. నీ అంత చదవుకోలేదు రఘునందన్.. కానీ ఐటీఐఆర్ వల్ల రాష్ర్టానికి కలిగే లాభం తెలుసు అని అన్నారు. గతంలో సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకుంటుంన్నా అని వైఎస్సార్ అడిగారు.. నిజానికి ఆరోజు ఐఐటీ అంటే నాకు తెలియదు.. కానీ సీఎం అడిగారంటే ఇంపార్టెంట్ అని భావించి వెంటనే ఓకే చెప్పా.. ప్రజల జీవితాలపై నాకు చాలా అవగాహన ఉందన్నారు.
వైఎస్సార్ కు చాలా గొప్ప గుణం ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న నాకు కందిలో ఐఐటీ ఇచ్చారన్నారు. ఐఐటీ పెట్టే సమయంలో భూములు ఏమైనా కొనుక్కుంటావా అని వైఎస్సార్ నన్ను అడిగారు.. కానీ ఐఐటీ ఆలస్యం అవుతుందని.. వెంటనే ప్రకటన చేయమని కోరానన్నారు. చదువు నీకు అహాంకారం నేర్చింది రఘునంధన్.. నీలాగ నేను లా బుక్స్ చదవలేదు.. ప్రజల మనస్తత్వం చదివా.. ప్రజల అవసరాలను గుర్తించానన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐఐటీని గాలికొదిలేసారు.. 30 ఏళ్ళ క్రితం ముంబై పోవై అనే అటవీ ప్రాంతంలో ఐఐటీ పెట్టారు.. ఇప్పుడు అది గ్రేటర్ ముంబై అయింది. నేను వైఎస్సార్ అడిగినప్పుడు ఫుల్ ఫాం గురించి ఆలోచిస్తే.. కందిలో ఐఐటీ వచ్చేది కాదు అన్నారు.
ఐఐటీ తెచ్చిన నన్ను ఫుల్ ఫాం గురించి అడుగుతవా రఘు.. ఐటీఐఆర్ తీసుకొచ్చి నవ్వండి కిషన్ రెడ్డి.. ఉత్తమాటలతో కాదు.. ఈ నాలుగేళ్ల లో మీరు ఐటీఐఆర్ తెస్తరో లేదో తేల్తది.. మీకు చేతకాదని చెప్పిన నాడు.. మేమేంటో చూపస్తాం.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన రోజు ఐటీఐఆర్ తీసుకువస్తానన్నారు. ఐటీఐఆర్ తీసుకువస్తే.. రఘునంధన్ రావుకు శాలువా కప్పి సత్కరిస్తా.. 300 సీట్లతో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తరు.. ఇది నా రాజకీయ అంచనా, నమ్మకం అన్నారు.