TSPSC Paper Leak : గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

Congress has complained to the Governor about the TSPSC paper leak. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ‌ల్ల‌ లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

By Medi Samrat  Published on  22 March 2023 2:43 PM IST
TSPSC Paper Leak : గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

Congress has complained to the Governor about the TSPSC paper leak


టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ‌ల్ల‌ లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బుధ‌వారం రాజ్ భవన్ లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్ తో భేటీ అయ్యి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయమై ఫిర్యాదు చేశారు. అనంత‌రం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేపర్ లీక్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసాం. మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదే పేపర్ లీక్ లో కీలకపాత్ర అని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ కు అప్లికేషన్ పెట్టామ‌ని తెలిపారు.

వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామ‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కు ఉందని అన్నారు. అందరినీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించాం.. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్ కు ఉందని అన్నారు.

పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని.. కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని ఆరోపించారు. కేటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేయడానికి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు అప్లికేషన్ ఇచ్చామ‌ని తెలిపారు. లీగల్ ఓపినీయన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటామ‌ని గవర్నర్ చెప్పిన‌ట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


Next Story