కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ 400 ఎకరాల భూముల విషయంలో అందరూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఫేక్ వీడియోలను సృష్టించి అసత్య ప్రచారం చేశారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలిసీ తెలియని సమాచారంతో ఆయన మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రధాని తన కార్యాలయం ద్వారా తెలుసుకున్న తర్వాత మాట్లాడాలని సూచించారు.
హర్యానా యమునా నగర్ ర్యాలీలో ప్రధాని మోదీ కంచ గచ్చబౌలి భూములపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుందని, ప్రకృతి నష్టం, జంతువులకు ప్రమాదం జరుగుతోందని మోదీ విమర్శించారు.