తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్ష దివస్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న టైమ్ లో దీక్ష దివస్ నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని.. తక్షణమే దీక్షా దివస్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ప్రతి ఏడాది బీఆర్ఎస్ దీక్షా దివస్‌ను జరుపుతూ ఉంది. ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమం జరపడంపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వేడుకలు నిర్వహించరాదని సూచించింది. దీంతో, తెలంగాణ భవన్‌కు ఎన్నికల కమిషన్ స్వ్కాడ్ టీమ్ చేరుకుని కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరింది. కొత్త కార్యక్రమం కాదని ఎప్పటి నుంచో చేస్తున్నట్టు బీఆర్‌ఎస్ నేతలు, లీగల్ టీమ్ సూచించారు. డీసీపీతో కూడా మాట్లాడారు.
దీంతో ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా తెలంగాణ భవన్ లోపల నిర్వహించుకోవాలని వారికి పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో భవన్ లోపలే కార్యక్రమం నిర్వహించారు బీఆర్‌ఎస్ నేతలు.