కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేశారు: సీఎం రేవంత్

కమీషన్లు రావనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

By Knakam Karthik  Published on  26 Feb 2025 4:49 PM IST
Telangana, Cm RevanthReddy, Congress, Brs, Bjp, Pm Modi, Kcr

కమీషన్లు రావనే ఆ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేశారు: సీఎం రేవంత్

కమీషన్లు రావనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కేసీఆర్ మూలకు పడేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ప్రధానితో సమావేశం తర్వాత సీఎం రేవంత్ మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించారు. రేవంత్ మాట్లాడుతూ.. ఐదు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించా. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణను అనుమతించాలని కోరా. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి అనుమతి ఇవ్వాలని కోరా. రీజనల్ రింగ్ రైల్వే ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశా. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కోరా. మూసీ, గోదావరి లింకు కోసం జలశక్తి నుంచి రూ.2000 కోట్లు కేటాయించాలి.. తెలంగాణకు 29 ఐపీఎస్ క్యాడర్ పోస్టులను ఇవ్వాలి" అని ప్రధాని మోడీని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రధాని మోడీ అడిగారు. 11 శాఖలు సమన్వయంతోనే రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. నా కేబినెట్‌లోని మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అందరూ అనుభవజ్ఞులే, వారి శాఖలో సమర్థవంతంగా పని చేస్తున్నారు. నా పాలన అద్భుతంగా ఉంది. ఎవర్ ఫోన్‌లో వాళ్లు ధైర్యంగా మాట్లాడుకునే స్వేచ్ఛ నేను కల్పిస్తున్నా. పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును మూలన పడేయటం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అని సీఎం రేవంత్ చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్‌ఎల్‌బీసీని వంద శాతం పూర్తి చేసి తీరుతాం. పెరిగిన అంచనాలతో కలిపి రూ.5 వేల కోట్ల లోపే ప్రాజెక్టు పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి" అని సీఎం అన్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయని సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న లాయర్ సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తిల మరణాలపై కేటీఆర్ విచారణ ఎందుకు కోరడం లేదని సీఎం అన్నారు. కాళేశ్వరం నిపుణుల కమిటీ ఆధారంగానే చర్యలు ఉంటాయి. అసలు ఉప ఎన్నికలు ఎలా వస్తాయో అర్థం కావడంలేదు. 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడు ఉంది. బీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కడ ఉంది? పోటీలో లేని వారు మాట్లాడుతున్నారు" అని సీఎం రేవంత్ విమర్శించారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పని చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాలలో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకువస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారు." అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ప్రధానికి ఇచ్చిన ఐదు విజ్ఞప్తులను సాధించుకుని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లదే. నా వంతుగా నేను చేయాల్సింది చేశా.. అవన్నీ తీసుకువచ్చి క్రెడిట్‌ను వాళ్లే సొంతం చేసుకోవచ్చు. బహిరంగ సభలు ఏర్పాటు చేసి వారికి సన్మానం కూడా చేస్తా."అని సీఎం రేవంత్ అన్నారు.

Next Story