అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ లో త‌న ప్ర‌మేయం ఏమీ లేద‌న్నారు..

By Medi Samrat  Published on  13 Dec 2024 10:02 AM GMT
అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ లో త‌న ప్ర‌మేయం ఏమీ లేద‌న్నారు.. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని అన్నారు. చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే న‌ని ఆయ‌న పేర్కొన్నారు.. కేసు దర్యాప్తులో నా జోక్యం ఏమీ ఉండదని.. తొక్కిసలాటలో చనిపోవడం వల్లే పోలీసులు చర్యలు తీసుకున్నార‌ని సీఎం అన్నారు.

ఇదిలావుంటే.. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ను డిసెంబర్ 13న ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. పుష్ప-2 సినిమాపై బీభత్సమైన క్రేజ్ ఉన్న సమయంలో అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లడం, అభిమానుల అత్యుత్సాహం వల్ల జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ నిండు ప్రాణం పోయింది. ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు.

ప్రాథమిక దర్యాప్తులో సంధ్య థియేటర్ యజమానుల్లో ఒకరైన సందీప్, థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు, థియేటర్ లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఇన్​చార్జి గంధకం విజయ చందర్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డిసెంబర్ 5న భాస్కర్ ఈ ఫిర్యాదు చేశాడు. ఈ తొక్కిసలాట ఘటనపై విచారించిన పోలీసులు డిసెంబర్ 9న సంధ్య థియేటర్ మేనేజర్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఇదే కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story