సీఎం రేవంత్ రెడ్డి దావోస్ ట్రిప్ భారీ సక్సెస్ అయినట్లేనా.?

తెలంగాణ సీఎం దావోస్ పర్యటన సక్సెస్ అయిందని ప్రభుత్వం చెబుతోంది.

By Medi Samrat  Published on  23 Jan 2025 8:24 PM IST
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ ట్రిప్ భారీ సక్సెస్ అయినట్లేనా.?

తెలంగాణ సీఎం దావోస్ పర్యటన సక్సెస్ అయిందని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకుని వస్తుండడమే కాకుండా.. 49,550 ఉద్యోగాల కల్పనతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించారు. అమెజాన్ (AWS) - రూ. 60,000 కోట్లు, సన్ పెట్రోకెమికల్స్ - రూ. 45,500 కోట్లు, టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ - రూ. 15,000 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ - రూ. 15,000 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు హెచ్‌సిఎల్ (5,000 ఉద్యోగాలు), ఇన్ఫోసిస్ (17,000), విప్రో (5,000)తో భారీగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.

అమెజాన్, టిల్‌మాన్, ఉస్రా, CrtlS, Sify సంస్థలు తెలంగాణలో డేటా సెంటర్‌లు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కులు, డ్రై పోర్ట్, టౌన్‌షిప్‌లలో పెట్టుబడి పెట్టడానికి రామ్కీ గ్రూప్ సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. MTS గ్రూప్ నుండి కూడా తెలంగాణలో పెట్టుబడులు రానున్నాయి.

Next Story