సీఎం రేవంత్ ఇక్కడ.. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అక్క‌డ‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on  4 May 2024 9:45 AM IST
సీఎం రేవంత్ ఇక్కడ.. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అక్క‌డ‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈరోజు కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో జరిగే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంటు స్థానాల్లో కూడా భారీగా సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యంగా ప్రణాళికలను రచిస్తూ ఉంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 24వ తేదీన బస్సు యాత్రతో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతో బయలుదేరారు కేసీఆర్. ఇక ఎన్నికల కమిషన్ ప్రచారంపై నిషేధం విధించడంతో రెండు రోజుల పాటు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి శుక్రవారం రాత్రి నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తాలోని సాయంత్రం ఆరు గంటలకు ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. అనంతరం జరిగే కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొననున్నారు.

Next Story