రేపు ఢిల్లీకి వెళ్ల‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జ‌రుగ‌నున్న నేపథ్యంలో రేపు కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది.

By Medi Samrat  Published on  6 March 2024 7:02 PM IST
రేపు ఢిల్లీకి వెళ్ల‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జ‌రుగ‌నున్న నేపథ్యంలో రేపు కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కూడా అధిష్టానం చ‌ర్చిం,నుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనంతరం కాంగ్రెస్ తొలి జాబితా కూడా విడుదల చేసే అవకాశముందని నివేదిక‌లు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రేవంత్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తుంది.

ఇదిలావుంటే.. అధిష్టానం అప్పగించిన‌ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రేవంత్ రెడ్డి ఇప్పటికే పూర్తిచేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని పరిస్థితులను రేపు ఆయ‌న‌ ఢిల్లీ పెద్దలకు వివరిస్తారు. రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక‌పై క్లారిటీ రాగానే.. ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని స‌మాచారం.

Next Story