గుడ్ న్యూస్.. రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయ్..!

రైతు భరోసా పంట పెట్టుబడి ఆర్థికసాయాన్ని సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు

By Medi Samrat  Published on  1 Dec 2024 6:36 PM IST
గుడ్ న్యూస్.. రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయ్..!

రైతు భరోసా పంట పెట్టుబడి ఆర్థికసాయాన్ని సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిసెంబర్ 1 ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలను 100 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.

శనివారం నాటికి 25,35,964 మంది రైతులకు రూ.20,616.89 కోట్ల రుణాలను మాఫీ చేశామని, ఇది కేవలం 11 నెలల్లో సాధించిన రికార్డు అని సీఎం రేవంత్ ప్రకటించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వమే రుణాలను మాఫీ చేసిందని బీఆర్ఎస్ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతులు సోనా, BPT, HMT వరి రకాలు పండించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతులు పండించే సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందిస్తామని చెప్పారు.

Next Story