మా టార్గెట్ అదే : సీఎం రేవంత్ రెడ్డి

దావోస్ వేదికగా ఇటీవ‌ల‌ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే.

By Medi Samrat  Published on  28 Jan 2025 5:28 PM IST
మా టార్గెట్ అదే : సీఎం రేవంత్ రెడ్డి

దావోస్ వేదికగా ఇటీవ‌ల‌ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ టీమ్ నాలుగు రోజుల పాటు జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 16 కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్శించింది. ఈ క్రమంలో దావోస్ పర్యటన వివరాలను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. సెక్రటేరియట్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దావోస్ పర్యటనలో తెలంగాణకు మొత్తం రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఇంకా ఎన్నో కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మా ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలే నేడు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాష్ట్రానికి రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు రావడం.. మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అతిపెద్ద విజయమన్నారు.

పెట్టుబడులు తీసుకురావడం కొత్తేమి కాదని.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాల్లో కూడా భారీగా పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. హైదరాబాద్‎కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారని.. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించినా.. ఇన్వెస్టర్లు తెలంగాణ ప్రభుత్వంపై విశ్వాసాన్ని చాటుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజయోనాల విషయంలో రాజకీయాలు చేస్తే ఉపేక్షించబోమని ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాం కనుకే అన్ని పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 13 నెలల్లో రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story