వాళ్ల వివరాలను కనుక్కోండి: సీఎం రేవంత్ రెడ్డి

వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు

By Medi Samrat  Published on  11 Nov 2024 5:38 PM IST
వాళ్ల వివరాలను కనుక్కోండి: సీఎం రేవంత్ రెడ్డి

వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ఎస్మా) ప్రయోగించండని సూచించారు. వ్యాపారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలపై సమాచారం అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో మాట్లాడారు. రైతుల సమస్యలను తీర్చాలంటూ సూచించారు.

వరిధాన్యం కొనుగోలు సమయంలో రైతులను మోసం చేయడం, వేధించడం వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తితే జిల్లా అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని సీఎం సూచించారు. కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల వేధింపులు, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కప్పడానికి టార్పాలిన్ లేకపోవడం ఇతర సమస్యలపై రైతులు ఫిర్యాదుల నివేదికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Next Story