కేటీఆర్ లక్ష సాయంపై సీఎం రేవంత్ రెడ్డి కౌంట‌ర్..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గానికి చెందిన అన్నపూర్ణ కు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు

By Medi Samrat  Published on  27 Dec 2023 4:00 PM IST
కేటీఆర్ లక్ష సాయంపై సీఎం రేవంత్ రెడ్డి కౌంట‌ర్..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గానికి చెందిన అన్నపూర్ణ కు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అండగా నిలిచారు. ప్రజాదర్బార్‌లో పలుమార్లు తన సమస్యను విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని.. ఆమె దిక్కుతోచక అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆమె గోడు వినకుండా అక్కడి నుంచి పంపించివేశారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ని కలవాలని సలహా ఇచ్చారు. దీంతో ఆమె ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ని కలిశారు. అన్నపూర్ణ బాధలు విన్న తర్వాత, ఆమె కూతురు నర్సింగ్ చదువు కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు. బంజారాహిల్స్‌లో ఉన్న తన ఇంటికి పిలుచుకొని మరి చెక్కు అందజేశారు.

ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ సదరు మహిళకు రూ.1 లక్ష ఇచ్చారని, అంటే ప్రజావాణి లక్ష్యం నెరవేరినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె ప్రజావాణికి వచ్చి తన సమస్య చెప్పుకోవడంతో... అది తీరలేదని తెలిసి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. ఆమె ఇక్కడకు రాకుంటే సాయం అందకపోయి ఉండేదన్నారు. అయినా కేటీఆర్ తన లక్ష కోట్ల రూపాయల సంపాదన నుంచి కేవలం ఒక లక్ష రూపాయలు ఇచ్చారని తెలిపారు. ఎలా చూసినా ప్రజావాణి సక్సెస్ అయిందన్నారు. పదేళ్లపాటు కేటీఆర్, హరీశ్ రావులు తిన్నది ప్రజల రక్తం కూడు అని ఆరోపించారు. ప్రజల రక్తమాంసాలతో రూ.1 లక్ష కోట్లు సంపాదించారన్నారు. ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారు.. అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారని మండిప‌డ్డారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు.

Next Story