నేనే రాజు, నేనే మంత్రి కామెంట్స్‌పై సీఎం రేవంత్ క్లారిటీ (Video)

తనపై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

By -  Knakam Karthik
Published on : 15 Feb 2026 4:03 PM IST

CM Revanth Reddy, Telangana, Telangana politics, Congress Government, Brs

నేనే రాజు, నేనే మంత్రి కామెంట్స్‌పై సీఎం రేవంత్ క్లారిటీ (Video)

హైదరాబాద్: తనపై వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల విలేకరులతో చిట్‌చాట్‌లో ఆయన చేసిన "నేనే రాజు.. నేనే మంత్రి" అనే వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో.. సీఎం తాజాగా తన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.

సభ్య సమాజంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. "నేనే రాజు.. నేనే మంత్రి" అని అనడం వెనుక ఉన్న అర్థం నియంతృత్వం కాదని, ఫలితాలు ఏవైనా (గెలుపు లేదా ఓటమి) అన్నింటికీ తానే పూర్తి బాధ్యత వహిస్తాననే నైతిక ధైర్యంతో ఆ మాట అన్నానని వివరించారు. బాధ్యతను స్వీకరించే మనస్తత్వాన్ని విపక్షాలు మరోలా అర్థం చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, తన దృక్పథాన్ని ఇలా చాటారు. నేను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదు, ప్రజల సేవకుడిగానే భావిస్తున్నాను. ప్రజలు మాకు ఓటు వేసింది సేవ చేయడానికే, నాయకులు తమను తాము పాలకులుగా కాకుండా, ప్రజల సేవకులుగా భావించినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు ప్రజలను నిందించడం విపక్షాల అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.

Next Story