మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి: సీఎం రేవంత్

హైదరాబాద్‌లో జరిగిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా భద్రత, సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు

By -  Knakam Karthik
Published on : 7 March 2026 3:35 PM IST

Telangana, Hyderabad, Cm Revanthreddy, Congress Government,  Women’s Safety, Womens Day, StandWithHer

మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి: సీఎం రేవంత్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా భద్రత, సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం మహిళా దినోత్సవం జరుపుకోవడం మాత్రమే సరిపోదని, సమాజంలో మహిళల గౌరవం, రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. చట్టాలు, పోలీసులు మాత్రమే భద్రతను కల్పించలేరని, మహిళలను గౌరవించే సంస్కృతి సమాజంలో రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకంగా మహిళలకు రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నత పదవులను ఇచ్చిందని గుర్తు చేస్తూ, తన ప్రభుత్వం కూడా మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను వారి పేరుతోనే ఇస్తోందని స్పష్టం చేశారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేయడం, పెట్రోల్ బంకులు మరియు శిల్పారామంలో షాపుల కేటాయింపు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని, దీనిని అరికట్టేందుకు సమాజం బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు. చివరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ మహిళలను కార్పొరేట్ సంస్థలతో పోటీపడేలా ప్రోత్సహిస్తామని, వారికి మరిన్ని కీలక బాధ్యతలు అప్పగిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Next Story