చంద్ర‌బాబుకు ఆ అవ‌కాశం క‌ల్పించింది కేసీఆరే : జగ్గారెడ్డి

CM KCR providing opportunity to Naidu to revive TDP in Telangana. బీఆర్‌ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల‌నుకున్న‌ ముఖ్యమంత్రి కేసీఆర్

By Medi Samrat
Published on : 26 Dec 2022 9:15 PM IST

చంద్ర‌బాబుకు ఆ అవ‌కాశం క‌ల్పించింది కేసీఆరే : జగ్గారెడ్డి

బీఆర్‌ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల‌నుకున్న‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలంగాణలో ఆ పార్టీ పుంజుకునే అవకాశం కల్పిస్తుంద‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గత కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్నారని.. చంద్రశేఖరరావు బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లాల‌ని ప్రయత్నించి.. ఆయనకు అవకాశం కల్పించారని అన్నారు. తెలంగాణలో దాదాపు చచ్చిపోయిన టీడీపీకి సీఎం కొత్త ఊపు అందిస్తున్నారని అన్నారు. ఏపీ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ముద్ర వేసే ఛాన్స్ ఉందన్న ఆయ‌న‌.. తెలంగాణలో టీడీపీ మరోసారి శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణలో టీడీపీని పునరుజ్జీవింపజేయాలని సీఎం కేసీఆర్ చంద్ర‌బాబుని అనవసరంగా ప్రేరేపించారని అన్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడంలో కేసీఆర్‌ను తప్పుబట్టారు జగ్గా రెడ్డి. తెలంగాణ స్థానంలో భారత్‌ను తీసుకురావడం ద్వారా.. పార్టీ అధికారంలోకి వచ్చిన తెలంగాణ సెంటిమెంట్‌ను చంపేసింద‌ని అన్నారు.


Next Story