పరువునష్టం కేసులో రేవంత్‌రెడ్డికి కోర్టు ఇన్‌జంక్షన్‌ ఆర్డర్స్‌

City Civil Court Issues Injunction Order to Revanth Reddy. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేసిన పరువునష్టం

By Medi Samrat  Published on  21 Sep 2021 2:58 PM GMT
పరువునష్టం కేసులో రేవంత్‌రెడ్డికి కోర్టు ఇన్‌జంక్షన్‌ ఆర్డర్స్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా పిటిషన్‌పై మంగళ‌వారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. డ్ర‌గ్స్‌ కేసుతో ముడిపెడుతూ తప్పుడు ఆరోపణలు చేసి రేవంత్ రెడ్డి తన ప్రతిష్టకు భంగం కలిగించారని కేటీఆర్‌ పరువునష్టం దావా వేశారు. కేటీఆర్ పిటిష‌న్‌పై నేడు వాదనలు జ‌రిగాయి. వాద‌న‌లు విన్న‌ సిటీ సివిల్ కోర్టు మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసుతో ముడిపెట్టి కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు రేవంత్‌ను ఆదేశించింది. ఈ మేరకు రేవంత్‌రెడ్డిని ఆదేశిస్తూ ఇన్‌జంక్షన్ ఆర్డ‌ర్స్‌ జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణను అక్టోబర్‌ 20వ తేదీకి వాయిదా వేసింది.


Next Story
Share it