పోలీసులను ఆశ్రయించిన సినీ రచయిత చిన్ని కృష్ణ
Cinema Writer Chinni Krishna Approach Police. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ శనివారం పోలీసులను ఆశ్రయించారు.
By Medi Samrat Published on
19 Feb 2022 11:56 AM GMT

ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ శనివారం పోలీసులను ఆశ్రయించారు. శంకర్ పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని పలువురు ఆక్రమించుకున్నారని చిన్ని కృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసినందుకు కొందరు వ్యక్తులు తనపై దాడి చేసేందుకు వచ్చారని చిన్నికృష్ణ ఫిర్యాదు చేశారు. తనపై పరుష పదజాలంతో దూషించడమే కాకుండా దాడి చేసే ప్రయత్నం చేశారoటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్ని కృష్ణ శంకర్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. ఇదిలావుంటే.. చిన్ని కృష్ణ గతంలో టాలీవుడ్ అగ్రరచయితగా వెలుగొందారు. నరసింహ నాయుడు, గంగోత్రి, బద్రీనాధ్, జీనియస్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
Next Story