హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సుల ఛార్జీల పెంపునకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నారు. ఈ మేరకు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గం నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించనున్నారు. ఈ నిరసనకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయనున్నారు. ఉదయం 9:00 గంటలకు రెతిఫైల్ బస్ స్టాప్ నుండి టీఎస్‌ఆర్‌టీసీ బస్ భవన్ వరకు బస్సులో ప్రయాణిస్తారు. నాయకులు ఉదయం 9:30 గంటలకు బస్ భవన్‌కు చేరుకుని, టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తారు.