బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ పరస్పర విమర్శలపై ఆయన ఆదివారం మాట్లాడుతూ...సీఎం రమేశ్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. సీఎం రమేశ్‌ను కరీంనగర్‌కు తీసుకొచ్చే బాధ్యత నాది.. చర్చకు కేటీఆర్ సిద్ధమా? అని సవాల్ చేశారు. దమ్ముంటే టైమ్, డేట్‌ను కేటీఆర్ ఫిక్స్ చేయాలని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల టికెట్‌ను కేసీఆర్.. కేటీఆర్‌కు ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు. అక్కడ సుధాకర్ రావు అనే వ్యక్తి పోటీ చేయడానికి రెడీ అయితే, కేటీఆర్ వెళ్లి సీఎం రమేశ్‌ను కలిశారు. ఆయన కేసీఆర్‌ను కలిశాడు. అక్కడ కేటీఆర్ గెలవడు అని కేసీఆర్ చెప్పినట్లు సీఎం రమేశ్ నాతో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చెప్పారు. కాగా ఎన్నికల సందర్భంగా కేటీఆర్‌కు సీఎం రమేశే ఆర్థికసాయం చేశారు. ఆ డబ్బుతోనే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారు..అని బండి సంజయ్ మాట్లాడారు.