కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలమైన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను విచారించేందుకు

By Medi Samrat  Published on  5 April 2024 9:00 PM IST
కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలమైన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అనుమతిని మంజూరు చేసింది. జైలు ఆవరణలోనే కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. విచారణకు ఒకరోజు ముందుగా జైలు అధికారులకు తెలియజేయాలని, విచారణ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు షరతు విధించింది.

ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేయనుంది. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజుల పాటు విచారించారు. కోర్టు అనుమతించడంతో వచ్చే వారం ఆమెను విచారించాలని సీబీఐ భావిస్తోంది.

Next Story