బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే అధికార కాంగ్రెస్ కులగణన చేపట్టిందని.. ఆ నివేదికపై ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెడుతోందని ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధ కోసమే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుల గణన చేపట్టారని ఆరోపించారు. బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు పెంచాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన 21 హామీలు నెరవేర్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాటిని నెరవేర్చకుండా కులగణన పేరుతో ఇన్నాళ్లు కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేశారని అన్నారు. బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని.. ప్రస్తుతం కేబినెట్‌లో ఎంత మంది బీసీలకు మంత్రి పదవులు దక్కాయో చెప్పాలన్నారు. కేవలం స్థానిక ఎన్నికల్లో లాభం పొందేందుకే కులగణను తెరమీదకు తెచ్చారని అన్నారు. గతంలో సకల జనుల సర్వే చేయించినక మాజీ సీఎం కేసీఆర్ ఆ రిపోర్టును ఇంతవరకూ బహిర్గతం చేయలేదని విమర్శించారు.