ముఖ్య‌మంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూట‌ల కోస‌మే : కేటీఆర్

తెలంగాణ భ‌వ‌న్‌లో మూసీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు

By Medi Samrat  Published on  18 Oct 2024 7:07 PM IST
ముఖ్య‌మంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూట‌ల కోస‌మే : కేటీఆర్

తెలంగాణ భ‌వ‌న్‌లో మూసీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టబోయేది మూసీ బ్యూటిఫికేష‌న్ కాదు.. మూసీ లూటిఫికేష‌న్ అని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మవ‌డంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ముచ్చెట‌మ‌లు ప‌డుతున్నాయని అన్నారు. త‌న పాపం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చెప్పి రేవంత్ రెడ్డి త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు తాను ఏదో విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాన‌ని అనుకుని త‌న సంపూర్ణ‌మైన అజ్ఞానాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నారు. చేయ‌ని స‌ర్వేలను చేసిన‌ట్టు.. అబ‌ద్ధాలు, అస‌త్యాలు, అర్ధ స‌త్యాల‌ను అర్థంప‌ర్థం లేని అసంబద్ద వాద‌న‌ల‌ను సంపూర్ణంగా బ‌య‌ప‌టెట్టి త‌న ప‌రువు తానే తీసుకున్నారని విమ‌ర్శించారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఎలాంటి స‌ర్వే జ‌ర‌గ‌లేదన్నారు. మా ఇంటికి ఎవ‌రు రాలేదు.. స‌ర్వే జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లే చెబుతున్నారని.. సీఎం మాత్రం రెండు నెల‌ల నుంచి స‌ర్వే చేస్తున్నామ‌ని అబ‌ద్ధాలు ఆడుతున్నారని అన్నారు.

రెండు గంట‌ల పాటు రేవంత్ రెడ్డి ప్రాజెక్టు ల‌క్ష్యాల నుంచి మొద‌టుపెడితే ల‌క్ష‌న్న‌ర అంచ‌నా వ్య‌యం దాకా అన్ని అబ‌ద్దాలతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త వ‌స్తున్న క్ర‌మంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్నారు. ల‌క్ష‌న్న‌ర కోట్ల కుంభ‌ణానికి కాంగ్రెస్ నేత‌లు ప్లాన్ చేస్తున్నారని... దాన్ని స‌మాజం గ‌మ‌నిస్తుందన్నారు. మీరు ఆరు గ్యారెంటీల‌ను అట‌కెక్కించారు.. 420 హామీల‌తో ప్ర‌జ‌ల గొంతు కోశారన్నారు. ముఖ్య‌మంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూట‌ల కోస‌మే అని తేలిపోయిందన్నారు. ఈ ప్ర‌భుత్వం ఆలోచ‌న ఎలా ఉందంటే.. నోట్ల ర‌ద్దు చేసిన‌ప్పుడు మోదీ చెప్పిన మాట‌ల మాదిరిగా చోటే భాయ్ రేవంత్ మూసీపై రోజుకో మాట మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు.

Next Story