BJP రామచంద్రా నోరు తెరవరేం?..భద్రాద్రిని కాపాడండి: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ బీజేపీపై ఎక్స్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు.

By Knakam Karthik
Published on : 11 July 2025 10:04 AM IST

Telangana, Ktr, Brs, Bjp, Bhadradri Ramalayam, Bhadradri Temple, Purushottampatnam, Temple lands

BJP రామచంద్రా నోరు తెరవరేం?..భద్రాద్రిని కాపాడండి: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ బీజేపీపై ఎక్స్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు. భద్రాద్రి ఈవోపై దాడి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్టు చేస్తూ ఇలా రాసుకొచ్చారు..'BJP రామచంద్రా నోరు తెరవరేం?. రాములోరి భూములను ఆక్రమించుకుంటోంటే మాటైనా మాట్లాడరేం? మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక ఈసారి మొత్తం భద్రాద్రినే గంపగుత్తగా వారి చేతిలో పెడదామనుకుంటున్నారా? ఓట్ల కోసమే చేసే మీ రామజపాలను, సీట్ల కోసమే వేసే మీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు . మోడీతో మాట్లాడతారో మీ దోస్తు దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం. భద్రాద్రిని కాపాడండి, ఆక్రమణల చెర నుంచి విడిపించండి'..అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఈవోపై దాడి ఎందుకు జరిగింది?

పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి రామాలయానికి చెందిన సుమారు 889.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొందరు వ్యక్తులు కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా ఆ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ భూముల్లోని అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన (ఈవో) రమాదేవిపై కొందరు గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది ఆమెను భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Next Story