బైపోల్స్‌కు మేం రెడీ..సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

By Knakam Karthik
Published on : 31 July 2025 1:28 PM IST

Telangana, party defections case, Supreme Court, Ktr,  Brs, Congress,

బైపోల్స్‌కు మేం రెడీ..సుప్రీంకోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ఇలా రాసుకొచ్చారు..సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని భారత రాష్ట్ర సమితి స్వాగతిస్తున్నది. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీ చెప్పే మాటలకి, నీతులను కట్టుబడి ఉండాలని సవాలు విసురుతున్నా. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పంచ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయబోరని ఆశిస్తున్నాను..అని ఎక్స్‌లో రాశారు.

ఇక పార్టీ మారిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలి. భారత రాష్ట్ర సమితి తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు. పార్టీ తరఫున ఎన్నికైన 10 ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా.... కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షల మంది కార్యకర్తలకు ధన్యవాదాలు. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు మా పార్టీ సిద్ధం అవుతుంది. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. అంతిమంగా సత్యం ధర్మం గెలిచింది..అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Next Story