సీఎంకు విజన్ లేదు..ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

By Knakam Karthik
Published on : 17 Aug 2025 2:47 PM IST

Telangana, Ktr, Congress, Cm Revanth, Brs

సీఎంకు విజన్ లేదు..ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతుందని ఆయన ఆరోపించారు. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. ఇది నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందో దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం, ఒక నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని ఉటంకిస్తూ, తాను రెండేళ్ల క్రితమే అసెంబ్లీలో ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించానని గుర్తుచేశారు. అయినా, రేవంత్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు పీఆర్ కోసం ఖర్చు చేసి, ఇప్పుడు తీవ్రమైన న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోందని, చివరికి అధికారులు కూడా దీనిని అంగీకరిస్తున్నారని అన్నారు.

Next Story