అది లక్ష్మి బాంబా.? సుతిలి బాంబా.? తుస్సు బాంబా.? : పొంగులేటికి కేటీఆర్ కౌంట‌ర్‌

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళి లోపు బాంబు పేలుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  25 Oct 2024 3:21 PM IST
అది లక్ష్మి బాంబా.? సుతిలి బాంబా.? తుస్సు బాంబా.? : పొంగులేటికి కేటీఆర్ కౌంట‌ర్‌

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళిలోపు బాంబు పేలుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ.. బాంబు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ మీద ఏమన్న చెబుతాడేమో.? ఈడీ దాడుల్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికాయి. ఎన్ని కట్టల పాములు దొరికినయన్నది చెబుతాడా.? ఎట్ల బీజేపీతో సంధి కుదుర్చుకున్నది, ఎట్ల బీజేపీని బతిమిలాడి కేసు కాకుండా చూసుకున్నది, ఆదానీ కాళ్లు పట్టుకున్నది.. ఆ బాంబు ఏదైనా చెబుతాడా.? అంటూ సెటైర్లు సంధించారు.

అమృత్ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి బావమరిదికి రూ.1,137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి స్కాం చేశారని నేను ఆరోపిస్తున్నా.. దాని మీద బీజేపోళ్లు స్పందించటం లేదు.. దాని మీద విచారణకు ఆదేశించే బాంబు ఏమైనా పేల్చుతారా.? అని ప్ర‌శ్నించారు. అది లక్ష్మి బాంబా.? సుతిలి బాంబా.? తుస్సు బాంబా.? అన్ని తేలుతాయన్నారు.

నా మీద ఏమైనా కేసు పెట్టాలనుకుంటే ఏం పెట్టుకుంటావో పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో.. ఇటువంటి కొత్త బిచ్చగాళ్లను చాలా మందిని మేము చూశామ‌న్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్లతోనే కొట్లాడాం. ఈ చిట్టి నాయుడు మాకు పెద్ద లెక్క కాదని ఎద్దేవా చేశారు. చావుకు తెగించి తెలంగాణలో ఉద్యమంలో కొట్లాడినం. ఈ హౌలగాళ్ల పిచ్చి డైలాగులకు భయపడేటోడు ఎవడు లేడని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

వర్జినల్ బాంబులకే భయపడలేదు. వీళ్ల తుస్సు బాంబులకు భయపడేది లేదు. ఏదో అడ్డమైన కేసు పెట్టి జైలుకు పంపుతానంటే పంపు.. కానీ ఇప్పుడు ఎవ్వడైతే తెగించి రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్లు చేస్తున్నాడో, బిల్డర్లను బెదిరించి ఆర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడో ఇంతకు వంద రెట్లు మిత్తితో సహా ఇస్తామ‌న్నారు. మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే.. అప్పుడు వాళ్లను చూసుకునే బాధ్యత కూడా నాదేన‌న్నారు.

Next Story