బీఆర్ఎస్ కు భారీ షాక్.. తెలంగాణలో డబుల్ అయిన కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కేవలం 38 సీట్లను సాధించి పరాజయం పాలైన ఆరు నెలల తర్వాత.. ఆ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ఘోర పరాజయాన్ని చవిచూసింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Jun 2024 3:30 PM GMTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కేవలం 38 సీట్లను సాధించి పరాజయం పాలైన ఆరు నెలల తర్వాత.. ఆ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొమ్మిది సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్ 2024 ఎన్నికల్లో సున్నాతో సరిపెట్టుకుంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ 17 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయింది.
బీఆర్ఎస్ ఓట్లను చీల్చేసిన బీజేపీ, కాంగ్రెస్:
బీఆర్‌ఎస్ ఓట్ల వాటా ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ఉంది. ఒక్కో పార్టీ ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయి. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగ్గా 66.3 శాతం ఓటింగ్ నమోదైంది. ఎంపీ సీట్ల ప్రకారం రాష్ట్రంలో బీజేపీ సంఖ్య రెట్టింపు కావడంతో కమలం పార్టీ ఓటు బ్యాంకు తెలంగాణలో మరింత బలపడింది. గత ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ - నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న తరువాత, మోదీ నేతృత్వంలోని బీజేపీ 2024 ఎన్నికలలో ఎనిమిది సీట్లతో రెట్టింపు సీట్లను సాధించింది.
రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కమలం పార్టీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, తెలంగాణలో మాత్రం అద్భుతమైన పనితీరు చూపించింది. ఈసారి ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్‌లను బీజేపీ గెలుచుకుంది. అసెంబ్లీ స్థానాలను కోల్పోయిన బీజేపీ ఎమ్మెల్యేలు కరీంనగర్‌లో బండి సంజయ్, రఘునందన్ రావు (మెదక్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), అరవింద్ ధర్మపురి (నిజామాబాద్) పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నారు.
పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఓటమి:
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ సీట్ల వాటా ఐదు స్థానాలు పెరిగింది. కాంగ్రెస్ తరపున పెద్దపల్లిలో జి వంశీకృష్ణ, కె రఘువీర్ (నల్గొండ), ఆర్ రఘురాంరెడ్డి (ఖమ్మం), పి బలరాం నాయక్ (మహబూబాబాద్), కడియం కావ్య (వరంగల్), డాక్టర్ మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), చామల కిరణ్ కుమార్ రెడ్డి (నల్గొండ) విజయాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అర్బన్ నియోజకవర్గాల్లో ఒక్క సీట్ కూడా దక్కలేదు.
AIMIMకి చెందిన బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ MP సీటును నిలబెట్టుకోవడమే కాకుండా.. ఎన్నికల సమయంలో తప్పుడు కారణాలతో వార్తల్లో నిలిచిన BJP ప్రత్యర్థి K.మాధవి లతపై 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎన్నికల ఉల్లంఘన కింద బీజేపీ అభ్యర్థిపై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోయిన BRS:
కాంగ్రెస్-బీజేపీ తమ ఓట్ షేర్‌ను పెంచుకున్నప్పటికీ.. సున్నా సీట్లకే పరిమితమైంది BRS. లోక్‌సభలో గులాబీ పార్టీకి ఒక్క ప్రతినిధి కూడా లేరు. అనేక ఎగ్జిట్ పోల్స్ BRSకి ఒకటి లేదా సీట్లు రావని అంచనా వేసింది. అనుకున్నట్లుగానే జరిగింది.
‘నాయకుల అహంకారం, పేరుమార్పు (టీఆర్‌ఎస్‌గా బీఆర్‌ఎస్), కోట్లాది రూపాయల నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి, అట్టడుగు స్థాయి ప్రజలతో సంబంధాలు కోల్పోవడం వంటి కారణాలే ఓటమికి కారణం' అని ప్రజలు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తుంటి మార్పిడి చికిత్స తర్వాత పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ, పార్టీ సీటు నమోదు చేయలేదు.
అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పొరపాటు:
ఒక సీనియర్ రాజకీయ నాయకుడు న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, “బీజేపీ రెట్టింపు సీట్లు గెలుచుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చినందుకు BRS ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా గెలవలేని అభ్యర్థులను బీఆర్‌ఎస్ రంగంలోకి దించింది. అభ్యర్థుల ఎంపికలోనే పెద్ద తప్పు జరిగిందని ఇక్కడే తెలుస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా నాగర్‌కర్నూల్‌లో ఓడిపోయారు." అని తెలిపారు.