హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట.. రేపు, ఎల్లుండి పర్యటనలు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ టప్ పాలసీపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది.
By - Knakam Karthik |
హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట.. రేపు, ఎల్లుండి పర్యటనలు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ టప్ పాలసీపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై నిజనిర్ధారణ బృందాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేశారు.
కేసీఆర్ ఆదేశాలతో నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి రేపు, ఎల్లుండి ఆ ప్రాంతాల్లో ఈ బృందాలు పర్యటించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
కాగా క్లస్టర్ 1 లో మాజీ మంత్రి హరీష్ రావు బృందం పటాన్ చెరువు, పాశమైలారం, రామచంద్రాపురం ప్రాంతాల్లో పర్యటించనుంది. క్లస్టర్ 2 లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బృందం నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు. క్లస్టర్ 3 లో మధుసూదనా చారి బృందం మౌలాలి, కుషాయిగూడ ప్రాంతాల్లో, క్లస్టర్ 4 లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం జీడిమెట్ల కూకట్పల్లి ప్రాంతాల్లో, క్లస్టర్ 5 లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బృందం సనత్ నగర్, బాలానగర్ ప్రాంతాల్లో, క్లస్టర్ 6 మాజీ మంత్రి మల్లారెడ్డి బృందం మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్క్ లో, క్లస్టర్ 7 లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బృందం కాటేదాన్ హయత్ నగర్‌లో, క్లస్టర్ 8 మాజీ మంత్రి మహమూద్ అలీ బృందం చందూలాల్ బారాదరి ప్రాంతాల్లో పర్యటించనున్నారు.